కారు అద్దెకు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు.. సీటు కింద 300 సెల్‌ఫోన్లు..

కారు అద్దెకు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు.. సీటు కింద 300 సెల్‌ఫోన్లు..

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సెల్‌ఫోన్‌ దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వాళ్ల దగ్గర నుంచి 300 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్‌లో సాయిరాం, అభి అనే ఇద్దరు వ్యక్తులు కారును లోకల్‌గా అద్దెకు తీసుకున్నారు. ఐతే.. వీళ్లు విజయవాడ దాటి వెళ్తున్నట్టు GPS ద్వారా గుర్తించిన యజమాని అక్కడున్న తన బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఇంతలో కారు జగ్గయ్యపేట సమీపంలోని ఓ హోటల్‌లో ఆగినట్టు తెలుసుకుని.. మళ్లీ అది తిరిగి స్టార్ట్ కాకుండా జీపీఎస్ ద్వారానే నియంత్రించాడు. ఇది తెలియని దొంగలిద్దరూ కారు ఎందుకు స్టార్ట్ అవడం లేదో తెలియక దాన్ని రిపేర్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి సాయిరాం పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కారును పూర్తిగా తనిఖీ చేయగా.. సీటు కింద దాచిన 300 సెల్‌ఫోన్లు బయటపడ్డాయి. వీటి విలువ రూ. 30 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ చోరీ చేసిన మొబైల్సేనని.. సెకండ్‌హ్యాండ్ మార్కెట్‌‌లో అమ్మేందుకు తీసుకెళ్తున్నారని వివరించారు.

Read MoreRead Less
Next Story