కొట్టుకుపోయిన మూసీ గేటు.. 6 వేల క్యూసెక్కుల నీరు వృథా..

కొట్టుకుపోయిన మూసీ గేటు.. 6 వేల క్యూసెక్కుల నీరు వృథా..

దశాబ్దాల చరిత్ర కలిగిన మూసి ప్రాజెక్టు భవితవ్యం మరోసారి ప్రమాదంలో పడింది. గేట్ల లీకేజీతో ఆయకట్టు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 3ఏళ్ల క్రితమే 14కోట్లతో ప్రాజెక్ట్ గేట్ల పునరుద్దరణ చేపట్టారు. ఐనా ఇంతలోనే 6 నెంబర్‌ గల గేటు శిథిలావస్థకు చేరుకుని ఓవైపు ఊడిపోయింది. దీంతో నీరు వృథాగా పోతుంది. ప్రాజెక్టులో నీటిశాతం తగ్గుముఖం పడుతుండడంతో కుడి, ఎడమ కాలువ ఆయకట్టు రైతులు..కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు.

ఇప్పటి వరకు 6 వేల క్యూసెక్కుల నీరు వృథా అయినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్ముక్కుకావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. మరోవైపు సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో హెలికాఫ్టర్‌లో సూర్యాపేటకు చేరుకున్నారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్మిత సబర్వాల్‌. అక్కడునుంచి రోడ్డు మార్గంలో మూసి ప్రాజెక్ట్‌కు చేరుకున్నారు. గేట్‌ లికీజేని అరికట్టేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story