టమోటా రైతుల కష్టాలు.. రోడ్లపై పడేసే పరిస్థితి!

టమోటా రైతుల కష్టాలు.. రోడ్లపై పడేసే పరిస్థితి!

కర్నూలు జిల్లా టమోటా రైతులు కష్టాలు మాటల్లో చెప్పలేనివిగా ఉన్నాయి. గిట్టుబాటు ధరల్లేక రోడ్లపై పడేసే పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా చాలా మంది టమోటా రైతులు పత్తికొండ మార్కెట్‌లో ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులంతా కుమ్మక్కై గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారులు సిండికేట్‌గా మారుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ నుంచి తక్కువకు కొని... అధిక లాభాలు గడిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 కిలోమీటర్ల దూరంలో జత టమోటా గంపలు 6 వందలు పలుకుతుంటే.. పత్తికొండ మార్కెట్‌లో 40 నుంచి 2 వందలే ఉందని ఆవేదన చెందుతున్నారు.

పత్తికొండ మార్కెట్‌లో టమోటా రైతుల పరిస్థితులు తెలుసుకుని మాజీ డిప్యూటీ సీఎం KE కృష్ణమూర్తి అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కమిషన్ల గొడవ లేకుండా వేలం వేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story