దేవాలయంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల కీలక భేటీ!

దేవాలయంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల కీలక భేటీ!

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య అక్టోబర్‌ 11న చారిత్రక ప్రాధాన్యమున్న తమిళనాడులోని మమల్లాపురం ఆలయ ప్రాంగణంలో కీలక సమావేశం జరగనుంది. ఈ పర్యటనలో ఇద్దరు నేతలు రెండు కార్యక్రమాల్లో నాలుగు సార్లు వేర్వేరుగా భేటీ అవుతారు. వీరిద్దరూ దాదాపు 7 గంటలపాటు కలిసి గడపనున్నారు. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు చెన్నైలో చైనా ప్రధాని జిన్‌పింగ్‌ ల్యాండ్‌ అవుతారు. మమల్లాపురంలోని మూడు ప్రఖ్యాత ప్రదేశాల్లో వీరి భేటీ జరగనుంది.

ఈ శిఖరాగ్ర సదస్సులో.. ఇద్దరు దేశాధినేతలు ఏకాంతంగా ఎక్కువ కాలం గడపనున్నారు. మమల్లాపురంలోని అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశంతోపాటు పంచరథాలు, సముద్ర తీరాన ఉన్న ఆలయంలో ఇద్దరు నేతలు గంటపాటు సమావేశమవుతారు. ఈ సందర్భంగా పురాతన దేవాలయంలో సాంస్కృతి కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడే ఇద్దరు దేశాధినేతలు డిన్నర్‌ చేస్తారు. సుమారు 75 నిమిషాల పాటు డిన్నర్‌ జరుగుతుందని అధికారిక సమాచారం. అయితే ఇందులో ఉన్నతాధికారులు పాల్గొంటారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. డిన్నర్ తర్వాత జిన్‌పింగ్‌ చెన్నైలోని హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు.

రెండో రోజు సముద్రం ఒడ్డున ఉన్న ఫైప్‌ స్టార్‌ రిసార్ట్‌ గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు ఇద్దరు నేతలు సమావేశమవుతారు. ఈ సమావేశంలో 40 నిమిషాలపాటు జరగనుంది. గత ఏడాది వుహన్‌ బోట్‌ రైడ్‌లో జరిగినట్టుగానే ఇద్దరు నేతల మధ్య ప్రైవేటు సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు నేతల మధ్య మరో రెండుసార్లు సమావేశం జరుగుతుంది. లంచ్‌కూడా ఇద్దరు నేతలు అక్కడే పూర్తి చేస్తారు. కీలక భేటీల అనంతరం సాయంత్రం జిన్‌పింగ్‌ చైనా తిరుగు ప్రయాణమవుతారు.

ఇద్దరు దేశాధినేతల కీలక సమావేశం జరగనుండగా.. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులో 100 కిలోమీటర్ల ప్రాంతంలో భారత్ మిలటరీ సైనిక విన్యాసాలు నిర్వహించనుండటం విశేషం. అయితే... ఇదంతా చాలా నెలల క్రితం ఫిక్స్‌ అయిన ప్రోగ్రామ్‌ అని ఇండియన్‌ ఆర్మీ అంటోంది. కానీ చైనా విదేశాంగ శాఖ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు డొక్లమ్‌ ఉద్రిక్తతల తర్వాత పూర్తిగా చెడిపోయాయి. ఇప్పడు ఇద్దరు దేశాధినేతలు సమావేశం జరగనుండటంతో పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story