మీ సంగతి తేలుస్తానంటూ పోలీసులతో కానిస్టేబుల్‌ గొడవ

విజయవాడ సింగ్‌నగర్‌ పీఎస్‌ పోలీసులతో అగిరిపల్లి పీఎస్‌ కానిస్టేబుల్ పరుశురామ్‌ గొడవకు దిగాడు. రాత్రి ఇంటికి వెళ్తున్న క్రమంలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపాడు పరుశురాం. దీంతో.. కారు ఆపి కానిస్టేబుల్‌ పరుశురాంను ప్రశ్నించాడు ఓ యువకుడు. తనను ప్రశ్నించిన ఆ యువకుడి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో.. అతను పరుశురాంపై సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులో.. సింగ్‌నగర్‌ పోలీసులు పరుశురాంను స్టేషన్‌ను పిలిచారు. దీంతో రెచ్చిపోయిన పరుశురాం.. మీ సంగతి తేలుస్తానంటూ.. సింగ్‌నగర్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ను ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. ఏసీపీని సైతం లెక్కచేయకపోవడంతో ఈ పంచాయితీ జిల్లా ఎస్పీ వద్దకు చేరింది. దీనిపై సమగ్ర నివేదిక తీసుకున్న కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రబాబు.. అగిరిపల్లి కానిస్టెబుల్‌ పరుశురాంను సస్పెండ్‌ చేశారు.