జొమాటోకు లక్ష రూపాయలు ఫైన్..

జొమాటోకు లక్ష రూపాయలు ఫైన్..

కస్టమర్ ఫుడ్ బాగాలేదని కంప్లైంట్ ఇచ్చారా.. లేదంటే చెప్పిన టైమ్‌కి రాలేదా.. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి తెచ్చారా.. ఇవేవీ కాదు. మరెందుకు అంత ఫైన్ వేశారు అంటే వాళ్లు వాడని బ్యాగులన్నీ ఓ చోట కుప్పగా అపార్ట్‌మెంట్ టెర్రస్ మీద పడేశారు. దాంతో అవి దోమలకు ఆలవాలమవుతున్నాయి. అసలే డెంగ్యూ జ్వరాలని, మరొకటని ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇక ఇలా ఫుడ్ డెలివరీ బ్యాగులను శుభ్రపరచకుండా పడేస్తే దోమలు రాక ఏం చేస్తాయి. అందుకే దీనికి బాధ్యత వహిస్తూ.. మళ్లీ ఇలాంటి పొరపాట్లు చేయకుండా లక్ష రూపాయలు ఫైన్ కట్టమంటూ సంస్థకు నోటీసులు జారీ చేసింది

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. ఇటీవల చెన్నైలో డెంగ్యూ కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక కర్ణాటకలో అయితే 3,400 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దోమల విషయంలో సీరియస్ అయింది. పరిసరాలు కలుషితం చేసే సంస్థలపై చర్యలు తీసుకుంటోంది. నగరంలోని జొమాటో కార్యాలయం టెర్రస్ దోమలకు నిలయంగా మారిన విషయాన్ని అధికారులు గుర్తించారు. వాడని డెలివరీ బ్యాగులను టెర్రస్‌పై పడేయడంతో.. వాటిల్లో నీరు చేరి దోమలకు నివాస ప్రాంతాలయ్యాయి. ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ జొమాటోపై ఫైన్ వేసింది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ కమిషనర్ పి. మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story