మద్యపానం నిషేధం పేరుతో రేట్లను పెంచారు : చంద్రబాబు

మద్యపానం నిషేధం పేరుతో రేట్లను పెంచారు : చంద్రబాబు

chandrababu

3 రోజుల పర్యటన కోసం చిత్తూరు జిల్లా వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. చంద్రగిరిలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. తొలిరోజు తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు. పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. దీంతో పార్టీకి పునర్‌వైభవం తీసుకురావడంపై చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ చేస్తూ.. కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సర్కారు అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు. మద్యపానం నిషేధం పేరుతో రేట్లను పెంచారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు వేయడాన్నితప్పుపట్టారు.

గతంలో ఎప్పుడురాని ఇసుక కొరత ఇప్పుడే ఎందుకు వస్తోందని నిలదీశారు చంద్రబాబు. ఏపీ నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాదు నగరాలకు ఇసుక తరలిపోతోందని ఆరోపించారు. ఈ సమస్యపై ప్రశ్నించినందుకు పవన్ కల్యాణ్‌ను కూడా టార్గెట్ చేశారని విమర్శించారు.

గతంలో దోమలపై దండయాత్ర అనే కార్యక్రమం పెడితే విమర్శించారని మరి ఇప్పుడీ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు చంద్రబాబు. ప్రజలు డెంగీ వ్యాధితో చనిపోతున్నా..చీమ కుట్టినట్లయినా లేదంటూ అంటూ మండిపడ్డారు. కొందరు పోలీసుల తీరుపైనా ధ్వజమెత్తారు చంద్రబాబు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story