చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

road-accident

చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి శనివారం పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. కంటైనర్ స్పీడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. దీంతో గుర్తు పట్టడం కష్టంగా మారింది. రాత్రి వేళ మృత్యువులా మీదకు దూసకొచ్చింది ఓ కంటైనర్. బీభత్సం సృష్టించింది. చివరికి 12 మంది ప్రాణాలను బలితీసుకుంది. బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది.

భారీ కంటైనర్‌ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆటో, ఓమ్నివ్యాన్, బైక్‌పైకి దూసుకెళ్లింది. ఈ అనూహ్య ఘటనతో ఎం జరిగిందో అర్ధమయ్యే లోపే సగం మంది ప్రాణాలు కొల్పోయారు. ఘటన తర్వాత మొగిలిఘాట్ రోడ్డు అత్యంత భయంకరంగా మారింది. మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కంటైనర్ మీద పడటంతో ఆటో, ఓమ్నివ్యాన్, బైక్‌ తుక్కుతుక్కయ్యాయి. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. ప్రమాదంలో గాయడపిన వారిని పలమనేరు ఆస్పత్రికి తరలించారు. అతివేగం, కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాజం జరిగినట్లు తెలుస్తోంది. ఓవర్ స్పీడ్‌ వల్ల డ్రైవర్ భారీ కంటైనర్‌ను అదుపుచేయలేకపోయాడు. ఘటనా స్థలాన్నిజిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పరిశీలించారు.

మృతుల్లో ఎనిమిది మంది ఒకే కటుంబానికి చెందిన వాళ్లు ఉండటం అందర్ని కలిచివేసింది. గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన రెడ్డి శేఖర్ కుటుంబానికి చెందిన 8 మంది ఓమ్నీ వాహనంలో తెట్టుగుండ్లపల్లికి వెళ్లారు. తమ బంధువుల కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోవడంతో పరామర్శించి తిరిగి వస్తుండగా..ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బంగారుపాళ్యం మండలం బలిజపల్లెకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలో మృతిచెందారు. మృతుల్లో కంటైనర్ డ్రైవర్ కూడా ఉన్నాడు. మృతదేహాలన్నీ ఛిద్రమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తగిన సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ప్రమాదాలు జరగక్కుండా భద్రత ప్రమాణాలు పాటించటంతో పాటు ఎప్పటికప్పుడు వాహనాల పిట్ నెస్ తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story