రానున్న సంస్థాగత ఎన్నికల్లో కార్యకర్తలనే నిలబెడతాం : చంద్రబాబు

రానున్న సంస్థాగత ఎన్నికల్లో కార్యకర్తలనే నిలబెడతాం : చంద్రబాబు

chandrababu-and-chintamanen

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి ప్రజలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పార్టీ నేతలతో విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ప్రజావేదికను కూల్చి ఏం సాధించారని ప్రశ్నించారు . రాష్ట్రంలో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. . ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు బయపడేవారెవరూ లేరన్నారు.

తప్పుడు కేసులు పెడితే ప్రైవేట్‌ కేసులు వేస్తామని.. చట్ట ప్రకారం పోరాడతామన్నారు టీడీపీ అధినేత. దుగ్గిరాల వస్తుంటే పోలీసులు వ్యవహరించిన తీరు బాధించిందన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు ఇటీవలే బెయిల్‌పై విడుదలైన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు చంద్రబాబు. అక్రమ కేసులకు భయపడవద్దని ధైర్యం చెప్పారు. చింతమనేనిపై తప్పుడు కేసులు పెట్టి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చింతమనేని ధైర్యంగా ఉన్నారని.. ఇతర నేతలకు స్పూర్తి అని చెప్పారు.

జిల్లాలో నియోజకవర్గాల వారిగా సమీక్షచేపట్టిన చంద్రబాబు రానున్న సంస్థాగత ఎన్నికల్లో కార్యకర్తలనే నిలబెడతామని ప్రకటించారు. సంస్థాగత ఎన్నికల్లో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో పాల్గొనేందుకు యువత, మహిళలు మందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story