తుంగభద్ర బోర్డు సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకి వచ్చేసిన ఏపీ అధికారులు

తుంగభద్ర బోర్డు సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకి వచ్చేసిన ఏపీ అధికారులు

tungabadra

బళ్లారిలో తుంగభద్ర బోర్డు సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఏటా నీటిదోపిడీ జరుగుతోందంటూ ఏపీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా నివేదికలపై సంతకం చేయలేదు. సమావేశం నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. తుంగభద్ర బోర్డు ఎస్.ఈ. వెంకటరమణ ఆధ్వర్యంలో నీటి పంపకాలపై సమీక్ష జరిగింది.

దాదాపు 12 ఏళ్ల తర్వాత తుంగభద్ర డ్యామ్ కు రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ప్రాజెక్టు మొత్తం నిండినా.. నీటా వాటా లెక్కల్లో భారీ తేడాలున్నాయని.. ఏపీ ఆరోపిస్తోంది. 405 టీఎంసీల వరద వస్తే.. లెక్కల్లో మాత్రం 396 టీఎంసీలు మాత్రమే చూపినట్లు విమర్శలున్నాయి. సాగునీటి కాలువలు.. దిగువకు వదిలిన నీరు కాకుండా ప్రస్తుతం డ్యామ్‌లో 171 T.M.Cల నీరు మాత్రమే ఉన్నట్లు తుంగభద్ర బోర్డు ప్రకటించింది. జూలై 13న జరిగిన మీటింగ్‌లో 163

టీఎంసీల నిల్వలున్నట్లు చూపారు. ఆ తర్వాత భారీగా వరద వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కేవలం 171 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు లెక్కులు చూపిస్తున్నారు బోర్డు అధికారులు.

నీటి పంపకాలలో ఏటా ఇదే విధంగా ఏపీకి అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఇంతా జరుగుతున్నా.. ఏపీ ఇంజినీరింగ్ అధికారులు గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారన్న విమర్శలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story