పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ

pol

మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించింది. స్పిల్‌వే ప్రాంతంలో కాంక్రీట్‌ పనుల్ని ప్రారంభించింది. తొలిరోజు వంద క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేసింది. వాస్తవానికి రోజుకు 2 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనుల్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది మేఘా సంస్థ. ఇక రాక్‌ఫిల్‌ డ్యాంలో కోటిన్నర క్యూబిక్‌ మీటర్లు పనులు చేయాల్సి ఉంది. అటు ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం, ఇటు కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేయనుంది మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ. స్పిల్‌వే పనులు 2020 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని, 2021 నాటికి పనులు పూర్తవుతాయని తెలిపింది.

Recommended For You