కేసీఆర్ దారెటు?

www

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం పిలుస్తుందా? అసలు సీఎం కేసీఆర్‌ వ్యూహమేంటీ? ఎలాంటి షరతులు లేకుంటే సమ్మె విరమణకు సిద్ధమని ఇప్పటికే జేఏసీ ప్రకటించింది. కానీ ఇంతవరకూ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష చేస్తున్నారు. మంత్రి పువ్వాడతోపాటు ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కార్మికుల ప్రతిపాదనపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమీక్ష తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Recommended For You