మా అనుమతి లేకపోతే సీజ్ చేస్తాం: తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ

మా అనుమతి లేకపోతే సీజ్ చేస్తాం: తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ

boatతెలంగాణ-ఏపీ మధ్య మరో పంచాయితీకి తెరలేచింది. నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ నడపాలంటే తమ అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు ఏపీ అధికారులు. అటు ఈనెల 30న లాంచీ ప్రయాణం ఉంటుందని ఇప్పటికే తెలంగాణ టూరిజం శాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 7న సాగర్-శ్రీశైలం మధ్య బోట్‌ను నడిపారు తెలంగాణ అధికారులు. ఆ తర్వాత గోదావరిలో భారీ పడవ ప్రమాదం జరగడంతో.. తాత్కాలికంగా నిలిపివేశారు.

మళ్లీ ఇప్పుడు సాగర్ టు శ్రీశైలం మధ్య లాంచీని నడపాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. పలువురు పర్యాటకులు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటూ ఏపీ టూరిజం శాఖ.. తెలంగాణ టూరిజం శాఖకు లేఖ రాసింది. పర్మిషన్ లేకుండా నడిపితే బోట్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించింది. అయితే ఈ లేఖపై తెలంగాణ అధికారులు ఇంకా స్పందించలేదు. ఈ గొడవ కారణంగా ఈనెల 30న లాంచీ ప్రయాణం ఉంటుందా? ఉండదా? అన్నది సందిగ్ధంలో పడింది.

Tags

Read MoreRead Less
Next Story