అవినీతి ఫిర్యాదులపై నెలరోజుల్లోనే దర్యాప్తు ప్రారంభించాలి: సీఎం జగన్

అవినీతి ఫిర్యాదులపై నెలరోజుల్లోనే దర్యాప్తు ప్రారంభించాలి: సీఎం జగన్

cm-jagan

అవినీతిపై ఫిర్యాదుల కోసం కొత్తగా కాల్‌ సెంటర్‌ను తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. 144-00 అనే నెంబర్‌తో సిటిజెన్‌ హెల్ప్‌లైన్‌ కాల్‌ సెంటర్‌ను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ నెంబర్‌కు స్వయంగా ఫోన్ చేసిన సీఎం జగన్.. కాల్‌ సెంటర్ పనితీరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. 15 నుంచి నెల రోజుల్లోపే దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించారు. కాల్‌ సెంటర్‌కు సంబంధించిన పోస్ట్‌ర్‌ను కూడా ఆవిష్కరించారు.

ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏ పని చేసినా.. దీర్ఘకాలిక మన్నికతోపాటు.. ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని ఆదేశించారు సీఎం. కడప, పులివెందులను మోడల్ టౌన్స్‌గా తీర్చిదిద్దాలన్నారు. పులిచింతలలో నిర్మించనున్న వైఎస్సార్ ఉద్యానవనం ప్రణాళికను జగన్‌కు అధికారులు అందించారు.

Tags

Read MoreRead Less
Next Story