పాత కారుకు టాటా చెప్పిసి.. కొత్త టాటా కారు బుక్ చేసి..

పాత కారుకు టాటా చెప్పిసి.. కొత్త టాటా కారు బుక్ చేసి..

tata-car

ఈ ఏడాది మార్చిలోనే జెనీవా మోటార్ షోలో తొలిసారిగా హార్న్‌బిల్ పేరుతో టాటా మోటార్స్ హెచ్‌2ఎక్స్ కాన్సెప్ట్ మోడల్ కారుని ప్రదర్శించారు. అప్పటి నుంచి ఈ కారు మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు వాహన ప్రియులు. ఆ రోజు రానే వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఈ కార్లు కనిపించనున్నాయి. ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఇంటీరియర్ డిజైన్ సింపుల్‌గా ఉంటుంది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా ఎన్నో టెక్నాలజీ కనెక్టెడ్ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. సాంకేతికంగా టాటా హెచ్‌2ఎక్స్ కారులో బిఎస్-6 ప్రమాణాలను పాటించే 1.2 లీటర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది.

84 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఈ కారు ఇంజన్ టాటా టియాగో బిఎస్-4 మోడల్‌లో ఉంది. అతి త్వరలో మార్కెట్లోకి రానున్న టాటా హెచ్‌2ఎక్స్ ప్రారంభ ధర రూ.4.75 లక్షల నుండి 5.75 లక్షల మధ్య ఎక్స్‌-షోరూమ్ (ఢిల్లీ)గా ఉండవచ్చు. ఇది మార్కెట్లో ఉన్న మారుతి ఇగ్నిస్ మరియు మహీంద్రా కెయువి100 మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని ఆశిస్తున్నారు తయారీ దారులు. టాటా నుండి ఇలాంటి మోడల్ కార్లు ఇప్పుడే మార్కెట్లోకి వస్తుండడంతో ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. సేల్స్ భారీ స్థాయలో ఉండవచ్చని అంచనా వేస్తోంది.

Read MoreRead Less
Next Story