మరో ఉద్యమానికి సిద్ధమవుతోన్న టీడీపీ

మరో ఉద్యమానికి సిద్ధమవుతోన్న టీడీపీ

bb

ఏపీలో మరో ఉద్యామనికి రెడీ అవుతోంది టీడీపీ. రాజ‌ధాని ప్రాంతంలో నిలిచిపోయిన భ‌వ‌నాలు, రైతుల ప‌క్షాన పోరాటానికి ఆపార్టీ అధినేత చంద్రబాబు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఒక ధ‌పా రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్యటించారు టీడీపీ నేత‌లు. ఈ సారి పార్టీ ఛీప్ చంద్రబాబే రంగంలోకి దిగుతున్నారు. ఈ 6 నెలల్లో అమరావతిపై ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొర‌తపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేసింది టీడీపీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ ధర్నాచౌక్‌లో దీక్ష కూడా చేశారు. ఇప్పుడు రాజ‌ధానిపై ఫోక‌స్ చేశారాయన. గ‌త 6 నెల‌లుగా అభివృద్ది ప‌నులు నిలిచిపోవ‌డంతో ప్రభుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు టీడీపీ రెడీ అయింది. తమ ప్రభుత్వ హయంలో రాజ‌ధాని ఎలా ఉండేది. ఇప్పుడెలా తయారైందో ప్రజలకు చెప్పేందుకు నేతలు రెడీ అవుతున్నారు.

ఈనెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్యటించనున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ వైఫ‌ల్యాల్ని ప్రజలముందు ఉంచిన ఆయన.. ఇప్పుడు నేరుగా ఫీల్డులోకి దిగుతున్నారు. రాజ‌ధానిలో భ‌వ‌నాలను పరిశీలించనున్నారు. రాజ‌ధాని కోసం 33వేల ఎక‌రాలు ఇచ్చిన రైతులతోను స‌మావేశం అవుతారు.

టీడీపీ అధికారం కోల్పోయే స‌మయానికి ఎమ్మెల్యేల క్వార్టర్స్‌తో పాటు దాదాపు అన్ని భ‌వ‌నాలు 80 శాతం ప‌నులు పూర్తయ్యాయని తమ్ముళ్లు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఎలాంటి పనులు జరుగడం లేదన్నారు. దీంతో క్షేత్రస్థాయి పర్యటనలో వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచనున్నారు చంద్రబాబు. అటు.. స‌ర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో రాజ‌ధానిగా అమ‌రావ‌తి పేరుని ప్రక‌టించ‌డంతో మ‌రింత దూకుడుగా వెళ్ళాల‌ని భావిస్తున్నారు. ఇసుక విష‌యంలో ప్రభుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టగ‌లిగిన టీడీపీ.. రాజ‌ధాని విష‌యంలోను దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story