పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం.. పలువురికి గాయాలు

పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం.. పలువురికి గాయాలు

Screenshot_1

హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపో దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతకాలం సమ్మె పేరుతో విధులకు దూరంగా ఉన్న మహిళా కార్మికులు.. విధుల్లో చేరుతామంటూ డిపోకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వాళ్లను విధుల్లోకి చేర్చుకునేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మహిళా కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. అది తోపులాటగా మారి.. ఇద్దరికి గాయాలయ్యాయి.

అటు రాచకొండలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. విధుల్లో చేరుతామని మహిళా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కార్మికుల అరెస్టుతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడే బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ వద్దంటూ డిమాండ్‌ చేశారు. నెల రోజులుగా జీతాలు లేక రోడ్డున పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story