అసం'తృప్తి'గా వెనకడుగు

అసంతృప్తిగా వెనకడుగు

truti

శబరిమల అయ్యప్పను దర్శించుకుని తీరతానంటూ పట్టుబట్టి మరీ కేరళకు వచ్చిన సామాజిక ఉద్యమకారణికి తృప్తీ దేశాయ్ వెనుతిరిగారు. భద్రత కల్పించలేమంటూ పోలీసులు తేల్చి చెప్పడంతో ఆమెతోపాటు దర్శనానికి సిద్ధమైన మరో ఏడుగురు ఎర్నాకుళం నుంచే వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. ఐతే.. తాము మళ్లీ వస్తామని, ఈ వివక్షపై జరుగుతున్న పోరాటంలో విజయం సాధిస్తామని పూణే వెళ్తూ అన్నారు. మంగళవారం ఎర్నాకుళం చేరుకున్న తృప్తి దేశాయ్.. పోలీసుల్ని రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. ఆ సమయంలోనే బిందు అనే మహిళపై కొందరు అయ్యప్ప భక్తులు కారంపొడి చల్లారు. ఇది కలకలం రేపింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా.. మధ్య వయసు మహిళలు ఆలయం వైపు వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుందని పోలీసులు చెప్తున్నారు. భద్రత కల్పించడంపై కోర్టు ఆదేశాలతో వస్తే తప్ప తాము ఏమీ చేయలేమని అన్నారు. ఇప్పటికే వేలాది మందితో సన్నిధానానికి వెళ్లే మార్గంలో సెక్యూరిటీ ఏర్పాటు చేశామని వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story