అర్థరాత్రి డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఏఎన్‌ఎంలు ఆందోళన

అర్థరాత్రి  డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఏఎన్‌ఎంలు ఆందోళన

anm

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఏఎన్‌ఎంలు అర్థరాత్రి ఆందోళనకు దిగారు. గ్రామ సచివాలయంలో నియమితులైన ఏఎన్‌ఎంలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తామని అధికారులు సమాచారం ఇవ్వడంతో జిల్లా నలుమూలల నుంచి.. ఏజెన్సీ ప్రాంతాల నుంచి అభ్యర్థులు వచ్చారు. వీరిలో గర్భిణులూ చాలా మంది ఉన్నారు. అయితే, వీరంతా డీఎంహెచ్‌వో ఆఫీసుకు వచ్చాక అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. కరెంటు లేదన్న సాకుతో ఆర్డర్‌ కాపీలు కొంతమందికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన వాళ్లను కనీసం పట్టించుకోలేదు సరికదా.. రేపు రావాలంటూ అర్థరాత్రి తాపీగా చెప్పి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారు. దీంతో 300 మంది మహిళా అభ్యర్థులు డీఎంహెచ్‌వో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అటు పవర్‌ కట్‌ వల్లే నియామక పత్రాలు ఇవ్వడం ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. 100 మందికి ఇవ్వగలిగామని.. మిగిలినవారికి మరుసటి రోజు ఇస్తామని అంటున్నారు. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story