బలం నిరూపించుకోనున్న కూటమి

బలం నిరూపించుకోనున్న కూటమి

uddhav

శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ సర్కారుకు బల నిరూపణ ఖరారైంది. అసెంబ్లీలో శనివారం మధ్యాహ్నం.. బలపరీక్ష జరగనుంది. ఈ మేరకు అసెంబ్లీ అధికారులు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. గురువారం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్‌థాక్రే.. శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రోటెం స్పీకర్‌గా ఎన్సీపీకి చెందిన దిలీప్‌ వాల్‌సే పాటిల్‌ నియమితులయ్యారు. ఎస్పీపీ, కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుండటంతో బలనిరూపణ లాంఛనమేనంటున్నాయి రాజకీయ వర్గాలు.

ఎస్పీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ స్పీకర్‌ పదవి ఇచ్చేలా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదురినట్లు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తెలిపారు. కాంగ్రెస్ డిప్యూటీ సీఎం పదవి తీసుకొని స్పీకర్‌ పదవిని ఎన్సీపీకి వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే.. తాము స్పీకర్‌ పదవి తీసుకోబోమని స్పష్టం చేశారు అజిత్‌పవార్‌. దీంతో ఎస్పీపీకి డిప్యూటీ సీఎం ఖరారైనట్లు తెలుస్తోంది. అటు.. స్పీకర్‌ పదవికి శనివారం ఎన్నిక జరిగే అవకాశముంది.

థాక్రే కుటుంబం నుంచి సీఎం పదవి అధిష్టించిన తొలి వ్యక్తి ఉద్ధవ్ థాక్రేనే. 1960లలో బాల్ థాక్రే శివసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఎవ్వరు కూడా సీఎం పదవి తీసుకోలేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా శివసేన నుంచి మనోహర్ జోషీ, నారాయణ్ రాణేలకు ముఖ్యమంత్రి పదవి లభించింది. థాక్రే వంశస్తులు మాత్రం కింగ్ మేకర్‌గానే ఉండిపోయారు. ఆ ఆనవాయితినీ ఉద్ధవ్ థాక్రే బ్రేక్ చేశారు. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్‌తో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరట్, నితిన్ రౌత్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు విశ్వాస పరీక్షల్లోనూ విజయం తమదేనంటోంది సంకీర్ణ ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story