నిరుద్యోగ సమస్య దేశానికి పెను సవాల్‌గా మారింది: ఆజాద్

నిరుద్యోగ సమస్య దేశానికి పెను సవాల్‌గా మారింది: ఆజాద్

a

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని.. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. పేదప్రజల ఖాతాల్లో 15 లక్షలు, రైతులకు మద్దతు ధర అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చలేదన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆజాద్.. గాంధీ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 10 శాతంగా ఉంటే బీజేపీ పాలనలో అది 5 శాతానికి పడిపోయిందన్నారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల పేరుతో ప్రజలపై కోట్లభారం మోపారని ఆరోపించారు ఆజాద్. విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య దేశానికి పెనుసవాల్‌గా మారిందన్నారు.

అటు.. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదంటూ... రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం భాదాకరమని.. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు తహసీల్దార్ విజయారెడ్డి హత్య హేయమైన చర్య అన్న ఆజాద్.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story