త్వరలో మన నుడి - మన నది : పవన్ కళ్యాణ్

త్వరలో మన నుడి - మన నది : పవన్ కళ్యాణ్

pawan-kalyan

మన భవితకు ప్రాణాధారమైన మాతృభాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుమని అభిప్రాయపడ్డారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ . నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరమన్నారు. మాతృభాషను, నదులను పరిరక్షించుకోనే దిశగా మన నుడి -మన నది కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. మాతృభాష మూలాలను మనమే నరికేసుకుంటున్నామని పేర్కొన్నారు. మన నదులను కాపాడుకోవడానికి , మాతృ భాషను పరిరక్షించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపు నిచ్చారు . మన నుడి.. మన నది కార్యక్రమం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు పవన్‌ కల్యాణ్.

Tags

Read MoreRead Less
Next Story