ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నాం.. కానీ.. :అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నాం.. కానీ.. :అశ్వత్థామరెడ్డి

as

ఆర్టీసీ సమ్మె విరమించాలని జేఏసీ నేతలు నిర్ణయానికొచ్చారు. అయితే యాజమాన్యం ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటేనే సమ్మె విరమిస్తామని.. లేదంటే సమ్మె కొనసాగుతందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పస్టం చేశారు. లేబర్‌ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం కూడా హైకోర్టు తీర్పును గౌరవించి ఎలాంటి షరతులు లేని వాతావరణం కల్పించాలని తాము కోరుకుంటున్నామన్నారు అశ్వత్థామరెడ్డి.

విధుల్లో చేరే కార్మికులపై చర్యలు తీసుకుంటామన్నా.. ఎలాంటి పేపర్లపై సంతకాలు పెట్టమన్నా అందుకు ఒప్పుకునేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో ఇక సమ్మెకు పుల్‌స్టాప్‌ పడుతుందా లేదా అన్నది ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఎలాంటి షరతులు లేకుండా ఇప్పటికిప్పుడు కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటే.. 47 రోజుల సమ్మెకు బ్రేకులు పడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story