గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే

గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే

U

గురువారం మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న శివసేన అధినేత ఉద్దావ్ థాక్రే.. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన ఉద్దవ్ ప్రమాణస్వీకార కార్యక్రమం గురించి చర్చించారు. గురువారం సాయంత్రం 6:30కి శివాజీ పార్క్‌లో ఉద్ధవ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అటు సీఎం ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా.. లేక డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణస్వీకారం చేస్తారా అన్నది క్లారిటీ లేదు. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ రేసులో బాలాసాహెబ్‌ తోరట్‌ ఉన్నారు. అటు ఎన్సీపీ నుంచి జయంత్‌ పాటిల్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖాయమంటున్నారు.

శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాలు కొనసాగుతున్నాయి. ప్రోటెం స్పీకర్ కళిదాస్ సభ్యుల చేత ప్రమాణం చేయిస్తున్నారు. అటు బీజేపీ వీడి అజిత్ పవార్ తిరిగిరావడంతో NCP నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్సీపీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తాను NCPలోనే ఉన్నానని, పార్టీతోనే ఉంటానని అజిత్ పవార్ స్పష్టం చేశారు. కొద్ది రోజలుగా మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని త్వరలోనే దీనిపై మాట్లాడతానని చెప్పారు. విధాన్ భవన్‌కు వచ్చిన అజిత్ ను... అక్కడే ఉండి MLAలు అందరికీ స్వాగతం పలుకుతున్న MP సుప్రియా సూలే ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఆశీర్వాదం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రజలంతా తమవైపే ఉండి మద్దతు ఇచ్చారని.. తమపై పెద్ద బాధ్యత ఉందని సుప్రియ అన్నారు.

అటు, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుతో జోష్ మీద ఉన్న శివసేన నేతలు.. సమర్థవంతమైన పాలన అందిస్తామని ధీమాగా చెప్తున్నారు. తాము ఢిల్లీలో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఐతే.. BJP మాత్రం కూటమి ప్రభుత్వ మనుగడ ఎక్కువ కాలం ఉండదని కౌంటర్లు వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story