పవన్ ఢిల్లీ వెళ్లటం వెనక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఇదేనా..?

పవన్ ఢిల్లీ వెళ్లటం వెనక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఇదేనా..?

pawan

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీ రాకీయాల్లో ఆసక్తిగా మారింది. రాయలసీమ పర్యటనతో ఏపీలో పొలిటికల్ హీట్ పెంచారు జనసేనాని. టూర్ తొలి రోజు నుంచే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన సహజనంగా ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. శుక్రవారం కూడా పవన్ రాయలసీమలో పర్యటించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం చిత్తూరు జిల్లాలో పర్యటించాలి. కానీ, ఉన్నట్టుండి షెడ్యూల్ రద్దు చేసుకొని మరీ పవన్ ఢిల్లీ వెళ్లటం వెనక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఏంటీ అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

కొద్దిరోజులుగా పవన్ పొలిటికల్ స్టాండ్ పట్ల స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆ మధ్య ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాతే ఏపీలో పవన్ దూకుడు పెరిగిందనే టాక్ ఉంది. దీనికితోడు తన సీమ పర్యటనలో అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీపై సానుకూల ప్రకటనలు చేసుకొచ్చారు. ఈనాటి రాజకీయాలకు అమిత్ షానే కరెక్ట్ అంటూ పరోక్షంగా రాష్ట్ర నాయకులను హెచ్చరించారు. అలాగే..తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేరని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ నెల మధ్యలో ఓసారి పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అప్పుడు BJP ముఖ్యుల్ని కలిసేందుకే వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే..అప్పట్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని పవన్ తిరిగి వచ్చారని జనసేన చెబుతోంది. కానీ, ఈసారి అమిత్‌షాను కలిసేందుకే వెళ్తున్నట్టు వార్తలు రావడంతో.. రాజకీయంగా ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న జనసేనాని.. కొన్ని అంశాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుత పర్యటన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఉంటుందా, లేదంటే రాజకీయ పరమైన చర్చలకు ఆస్కారం ఇస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story