15 ఏళ్ల నిరీక్షణ.. కన్నీరు మున్నీరుగా విలపించిన భవాని

15 ఏళ్ల నిరీక్షణ.. కన్నీరు మున్నీరుగా విలపించిన భవాని

bhavani

విజయవాడలో భవాని కథ సుఖాంతం అయింది. 15 ఏళ్ల ఆమె నిరీక్షణకు శుభం కార్డు పడింది. భవానీని చూడగానే.. కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. వారితో పాటు భవాని కూడా కన్నీరు మున్నీరుగా విలపించింది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మోహన్ వంశీ అనే వ్యక్తి భవానీని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించారు.

శ్రీకాకుళం చీపురు పల్లిలో దాదాపు 15 ఏళ్ల కిందట భవానీ అదృశ్యమైంది. సోదరుడి వెంట స్కూల్‌కి వెళ్లి తప్పిపోయింది. ఆ తరువాత ఆమె కోసం ఎన్నో ఏళ్లుగా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కన్నవారు ఆశలు వదలుకున్నారు. అయితే విజయవాడ పటమటలంకకు చెందిన మోహన్ వంశీ అనే వ్యక్తి.. భవానీని ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశాడు. తన ఇంట్లో పని చేసేందుకు వచ్చిన భవాని చరిత్రను శోధించిన వంశీ, ఆమె చెప్పిన ఆధారాలతో సంబంధిత వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించాడు.

ఎట్టకేలకు అతడి అన్వేషణ ఫలించింది. ఫేస్‌బుక్ ఆధారంగా భవాని కుటుంబాన్ని కనిపెట్టాడు. వెంటనే వారి కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేశాడు. ఇన్ని రోజులు తను పడ్డ కష్టమంతా మర్చిపోయి, ఆనందంతో వారితో మాట్లాడింది భవాని. వీడియో కాల్‌లో భవానిని చూసి చీపురుపల్లి వాసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆ యువతి తల్లిదండ్రులను కనుగొన్నందుకు మోహన్ వంశీ కుటుంబం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది.

అయితే ఇక్కడే స్టోరీలో అసలు ట్విస్ట్ వచ్చింది. భవానిని పెంచిన తల్లి జయమ్మ కన్నవారికి అప్పగించేందుకు ససేమిరా అంది. . వచ్చినవాళ్లే భవానీ కన్నతల్లిదండ్రులు అనడానికి గ్యారంటీ ఏంటి అని ప్రశ్నించింది. దీంతో ఈ అంశం చివరికి పోలీస్‌స్టేషన్‌కు చేరింది.. భవాని ఎవరి దగ్గర ఉండాలన్న అంశంపై కాసేపు వివాదం నడిచింది.. 14 ఏళ్లు పెంచాము కాబట్టి మా దగ్గర ఉండటమే న్యాయం అన్నారు పెంచినవాళ్లు.. లేదు మా బిడ్డ మా దగ్గరే ఉండాలని డిమాండ్ చేశారు కన్నవారు. దీంతో ఎవరి దగ్గర ఉండాలన్న అంశాన్ని భవానీకే వదిలేశారు.

Tags

Read MoreRead Less
Next Story