భలే ఉంది సైకిల్.. పే.. ద్దగా.. వీడియో వైరల్..

భలే ఉంది సైకిల్.. పే.. ద్దగా.. వీడియో వైరల్..

cycle

బుజ్జి సైకిల్ నుంచి ఓ మాదిరి పెద్ద సైకిల్ వరకు చూసి ఉంటాము. కానీ ఈ సైకిల్ భలే ఉంది. ఎక్కాలంటే ఎంత కష్టమో అనుకుంటారు. కానీ ఆ అబ్బాయి అవలీగా ఎక్కేసి ఎంచక్కా తొక్కేస్తున్నాడు. పైకెదిగిన చెట్టు ఆకుల్ని అవలీలగా అందుకుంటున్నాడు. దాదాపు 15 అడుగుల ఎత్తు ఉన్న ఈ సైకిల్ చక్రాలు మాత్రం చిన్నగానే ఉన్నాయ. హ్యాండిల్స్ఎక్కడో ఆకాశంలో ఉన్నట్లు పైన ఉన్నాయి. హ్యాండిల్ కిందే తొక్కేందుకు వీలుగా ఉంది. చాలా ఈజీగా ఎక్కేసి హ్యాపీగా తొక్కేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్షణాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ని సంపాదించుకుంది.

cycle

Read MoreRead Less
Next Story