పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో ఆందోళనలు

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో ఆందోళనలు

protest

కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్‌ మోరన్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు రెండో రోజు బంద్‌ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కూడా విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. లఖింపూర్‌, ధేమాజీ, టిన్సుకియా, దిబ్రూగఢ్‌, శివసాగర్‌, జోర్హట్‌, ముజులీ, మోరీగావ్‌, బొంగారుగావ్‌, ఉదల్‌గురి, కొక్రాజ్‌హర్‌, బక్సా జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర సర్కారు తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారులను దిగ్భంధించిన నిరసనకారులు.. పలు చోట్ల టైర్లను దహనం చేశారు. ఇటు దిబ్రూగఢ్‌, గువహతిల్లో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story