అవునా.. నిజమా.. చెమట చుక్క చెప్పేస్తుందట.. చుక్క ఎక్కువైందీ లేందీ..

అవునా.. నిజమా.. చెమట చుక్క చెప్పేస్తుందట.. చుక్క ఎక్కువైందీ లేందీ..

sweat-drops

ఫుల్లుగా మందు కొట్టడం.. బ్రీత్ ఎనలైజర్ నోట్లో పెడితే కోప్పడడం. ఊదను పో అంటూ పోలీసుల మీద దబాయింపు.. లేదంటే బుద్దిగా మౌత్ వాష్ చేసుకుని నేనెక్కడ వేశాను కావాలంటే చూస్కోండి అంటూ పోలీసులకే టెస్టులు. ఈ గొడవ ఎక్కడ భరించేది అంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని రోజులు ఆగితే కొత్త టెక్నిక్ వచ్చేస్తుంది. మందు బాబుల పని పడదాం అంటున్నారు న్యూయార్క్‌లోని అల్బేనీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.

బ్రీత్ ఎనలైజర్స్ స్థానంలో స్వెట్ టెస్ట్ (చెమట పరీక్ష)టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. మోతాదును బట్టి చెమట చుక్క రంగు మారుతుందట. త్వరలోనే ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులో వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏసీలో కూర్చుని పనిచేసే వారికి, ఏసీ వేసుకుని కారు నడిపే వారికి చెమట ఎలా పడుతుందో.. ఈ చెమట చుక్క తీసి మందెక్కువైందని కనిపెట్టడం ఏవిటో అస్సలు అర్థం కావట్లేదు. ఇది కనుక సక్సెస్ అయితే మందు బాబులకు చెమట పట్టడం ఖాయం అంటున్నారు. అదీ చూద్దాం.

Read MoreRead Less
Next Story