పోలీసులు నిందితులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు: సమత నిందితుల తరపు న్యాయవాది

పోలీసులు నిందితులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు: సమత నిందితుల తరపు న్యాయవాది

saMATA

సమత అత్యాచారం, హత్య కేసులో ఐదో రోజైన శుక్రవారం కూడా ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులు షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ మగ్దూమ్‌లను పోలీసులు బందోబస్తు నడుమ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. ముగ్గురు నిందితులపై కోర్టు నేరారోపణ అభియోగాలను ఖరారు చేసింది. నిందితులను విచారించిన కోర్టు.. గురువారం విచారణలో వారు నేరాన్ని ఒప్పుకోకపోవడంతో నేరారోపణ అభియోగాలను నమోదు చేసింది. నిందితుల తరపున కోర్టు నియమించిన న్యాయవాది రహీం తన వాదనలు వినిపించారు. పోలీసులు నిందితులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు.

పోలీసులు చేసిన అభియోగాలన్నీ నిరాధారమైనవని, ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. నమోదైన నేరాభియోగాలను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు వారి తరఫున న్యాయవాది డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది రహీం దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టేందుకు కోర్టు షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 23వ తేదీ నుంచి సాక్ష్యుల విచారణ ప్రారంభమవుతుంది. కేసు విచారణ అనంతరం నిందితులను బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జైలుకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story