కర్నూలులో హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తారు?

కర్నూలులో హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తారు?

ap-high-court

భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడే కర్నూలు తొలి రాష్ట్ర రాజధానిగా ఆవిర్భవించింది. కానీ, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. రాజధాని హైదరాబాద్ కు మారిపోయింది. అనాటి నుంచి తమకు అన్యాయం జరిగిందనే భావనలో ఉన్న కర్నూలులో.. చంద్రబాబు హయాం నుంచే అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా రాబోతుంది. అయితే..కర్నూలులో హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఏ భవనాన్ని హైకోర్టుకు కేటాయిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక్కడ మీరు చూస్తున్నది కర్నూలు సిటీ లో ఉన్న ఏపీ ఎస్పికి చెందిన రెండో బెటాలియన్ క్యాంప్. 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడే హైకోర్టు ఏర్పాటు చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి.

కర్నూలు, బెంగుళూర్,హైదరాబాద్ బళ్లారి జాతీయ రహదారులని కలిపే జంక్షన్ పాయింట్ కు సమీపంలోనే ఏపీఎస్పి బెటాలియన్ ఉంది. దీంతో ఇదే హై కోర్ట్ కి అనుకూలం అని మెజార్జీ వర్గాలు భావిస్తున్నాయి. సీనియర్ న్యాయవాధులు అభిప్రయపడుతున్నారు. ఏపీఎస్పి బెటాలియన్ భవనాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అంటున్నారు.

హై కోర్ట్ కి సొంత బవణాలు నిర్మించే వరకు అద్దె బవణాల్లో నిర్వహించాలి అనుకుంటే దానికి కర్నూలు శివారులోని ఓ ప్రయివేట్ కాలేజీని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది..కర్నూలు నుంచి బెంగుళూర్ కి వెళ్లే దారిలో చిన్నటేకూర్ సమీపంలో ఓ ప్రయివేట్ కాలేజీ బిల్డింగ్ గత కొంత కాలంగా ఖాళీగా ఉంది..ఈ బిల్డింగ్ ను లీజ్ కి తీసుకుని కొద్ది రోజులు ఇక్కడ నుంచి హై కోర్ట్ పాలన సాగించాలని కొంత మంది ఆ పార్టీ నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది..

అయితే..ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో హైకోర్టు ఏర్పాటు చేసి..ఆ తర్వాత ఓర్వకల్లులో శాశ్వత నిర్మాణాలు చేపట్టాలనే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు కూడా ఉండటంతో హైకోర్టు ఏర్పాటుకు అనుకూల ప్రాంతంగా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఓర్వకల్లులో ఒక్కసారిగా రియల్ భూం పెరిగింది. మొన్నటి వరకు ఎకరం రూ.40 లక్షలు పలికేది..ఇప్పుడు రూ.70 నుంచి రూ.80 లక్షల పెరిగాయి.

అయితే.. ఒక్క హైకోర్టుతోనే సరిపెడితే ఊరుకునేది లేదని అంటున్నారు రాయలసీమ వాసులు. మినీ సచివాలయం ఏర్పాటు చేస్తేనే సీమకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story