అమాంతంగా పెరిగిన 'హాక్ ఐ' యాప్‌ డౌన్‌లోడ్లు

అమాంతంగా పెరిగిన హాక్ ఐ యాప్‌ డౌన్‌లోడ్లు

hawk-eye

హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతి గురిచేసింది. ఈ అమానవీయ సంఘటన తర్వాత యువతులు, మహిళల భద్రతపై అవగాహన నేర్పింది. ఆపద సమయాల్లో బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసేకన్నా ముందుగా హాక్ ఐ మొబైల్‌ అప్లికేషన్‌లోని సేవ్‌ అవర్‌ సోల్‌ మీటను నొక్కితే చాలు అంటూ పోలీస్‌ శాఖ, టీవీ 5 ప్రచారం చేయడం సత్ఫలితాలనిస్తోంది. మొబైల్‌ ఫోన్‌లలో హాక్ ఐ యాప్‌ను డౌన్‌ లోడ్ చేసుకుంటున్నారు. రెండు రోజుల్లోనే 2 లక్షల 50 వేల మంది తమ మొబైల్స్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

దిశ హత్యోదంతం తర్వాతే ఈ హాక్ ఐ యాప్‌ను డౌన్‌ లోడ్ సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని పోలీసు అధికారులు తెలిపారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారిలో 70 వేల ఎక్కువ మంది హైదరాబాద్‌ వాసులే ఉన్నారు. శని, ఆదివారాల్లో గంటకు 6వేల మంది హ్యాక్ ఐ మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నారు.. వీరిలో చాలా మంది SOS మీటను నొక్కి పోలీసులు తమను గుర్తిస్తున్నారా లేదా అని పరిశీలించారు. కొంతమంది యువతులు తాము వెళ్తున్న ప్రాంతాల్లో ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే ముందు సేవ్‌ అవర్‌ సోల్‌ మీటను నొక్కి గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత క్షేమంగా చేరుకున్నామంటూ ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నారు.

అటు డయల్‌ 100కు ఫోన్‌ చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. విద్యార్థినులు, మహిళలు, యువకులు ఫోన్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రోజుకు సగటున 50 వేల మంది డయల్‌ 100ను సంప్రదిస్తుండగా నాలుగైదు రోజుల నుంచి ఆ సంఖ్య మరింత పెరిగింది. శని, ఆది, సోమ వారాల్లో రోజుకు సగటున 80 వేల మంది 100కు కాల్స్‌ చేశారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఫోన్‌ కాల్స్ స్వీకరించేందుకు ఆదనంగా కొంత మంది సిబ్బందిని నియమించుకున్నట్లు చెప్పారు. వస్తున్న ఫోన్‌ కాల్స్‌ను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని సంఘటన స్థలాలకు వెళ్తున్నామని పోలీసులు తెలిపారు.

Read MoreRead Less
Next Story