ఆవాలతో ఎన్ని లాభాలో.. శ్వాసకోశ సమస్యలున్నవారు..

ఆవాలతో ఎన్ని లాభాలో.. శ్వాసకోశ సమస్యలున్నవారు..

mustard-seeds

పప్పు తాలింపు... బట్ట జాడింపు అనే సామెత ఊరికే రాలేదు.. ఘుమ ఘుమలాడే పోపుకి కావలసిన దినుసుల్లో ప్రధానమైన ఆవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవాలు కూరకి రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ఆవాలు అతిగా తీసుకుంటే వేడి చేస్తాయి. నిల్వ పచ్చళ్లలో ఆవ పొడి వేస్తే రుచి అదుర్స్. ఆవాలలో దాగున్న మరిన్ని మంచి గుణాలు మనం తెలుసుకుందాం.. జీర్ణ శక్తిని వృద్ధి చేస్తాయి, మలబద్దకాన్ని తగ్గిస్తాయి. మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నవారు ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో పట్టులా వేస్తే ఉపశమనం ఉంటుంది.

బట్టతల వస్తోందని బాధపడుతూ కూర్చుంటే ఉన్న నాలుగు వెంట్రుకలు కూడా ఊడే అవకాశం ఉంది. అందుకే ఆవ నూనె రాస్తుంటే ఊడిన చోట మళ్లీ వెంట్రుకలు మొలకెత్తే అవకాశం ఉంది. జలుబుతో బాధ పడుతుంటే పాదాలపైనా, కిందా గోరువెచ్చని ఆవ తైలాన్ని రాయాలి. ఇలా చేస్తుంటే ముక్కు కారడం తగ్గిపోతుంది. కొద్దిగా నూనెను తీసుకుని చెస్ట్‌కి, గొంతుకి కూడా రాస్తే ఫలితం ఉంటుంది. పంటి నొప్పి ఇబ్బంది పెడుతుంటే గోరు వెచ్చని నీటిలో కాసిని ఆవాలు వేసి కొద్ది సేపు ఉంచాలి. ఆ తరువాత నీటిని వడగట్టి పుక్కిలించాలి. దీంతో పంటి నొప్పి తగ్గుతుంది.

శరీరంపై ఏర్పడే కురుపులు, దురదలను ఆవపొడి తగ్గిస్తుంది. ఆవ పొడిని నీటితో కలిపి ముద్దగా చేసి వాటిపై రాస్తుండాలి. ఆవ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులకు ఆవ నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి మర్దనా చేస్తుంటే ఉపశమనం లభిస్తుంది. చర్మంపై ఏర్పడే పులిపిర్లను ఆవపొడి ద్వారా తొలగించుకోవచ్చు. ఆవ పొడిని నీటితో తడిపి దాన్ని పులిపిర్లపై రాస్తుండాలి. ఇలా అవి రాలి పడిపోయే వరకు కొన్ని రోజుల పాటు రాస్తుండాలి. తద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి.

Read MoreRead Less
Next Story