బంగారం లాకర్‌లో పెడితే భద్రంగా ఉంటుందనుకుంటున్నారా.. కానీ..

బంగారం లాకర్‌లో పెడితే భద్రంగా ఉంటుందనుకుంటున్నారా.. కానీ..

gold-locker

ఇంట్లో పెట్టుకుంటే దొంగల బెడద అని ఉన్న బంగారాన్నంతా తీసుకెళ్లి బ్యాంక్ లాకర్‌లో పెడుతుంటారు. అక్కడ కూడా భద్రంగా ఉంటుందని బ్యాంకు యాజమాన్యం గ్యారెంటీ ఇవ్వలేదు. ఇంటితో పోలిస్తే బ్యాంకుల్లో దొంగతనాలు జరిగే అవకాశాలు తక్కువే ఉంటాయని భావిస్తుంటారు. కానీ లాకర్‌లోని వస్తువులకు బ్యాంకులు బాధ్యత తీసుకోవనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే మీ వస్తువులను లాకర్లో పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విలువైన మీ బంగారపు వస్తువులకు బీమా చేయించుకుంటే వస్తువు భద్రంగా ఉంటుంది. పాలసీ ఉన్న వస్తువుకు ఇంట్లో ఉన్నా, లాకర్‌లో ఉన్నామీ బంగారం దొంగిలించబడినా, అగ్నిప్రమాదం వంటివాటికి గురైనా బీమా వర్తిస్తుంది. యాక్ట్ ఆఫ్ గాడ్స్, యాక్ట్ ఆఫ్ టెర్రరిజం వంటి వాటిపై బీమా వర్తిస్తుంది. బ్యాంకు లాకర్లో బంగారు వస్తువులతో పాటు, కీలక డాక్యుమెంట్లను కూడా బీమా చేయించుకోవచ్చు. ఎవరైనా లాకర్‌లో అధిక విలువైన ఆభరణాలు లేదా డాక్యుమెంట్స్ ఉంచితే అలాంటి సమయాల్లో బీమా మంచి ఎంపిక.

Read MoreRead Less
Next Story