ప్రియాంక హత్యపై అసభ్యకర పోస్టులు చేసిన యువకులపై కేసు నమోదు

Priyanka-Reddy666

ప్రియాంకారెడ్డి హత్యపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్నారు కొందరు దుర్మార్గులు. మానవత్వం మరిచి.. నిందితులకు సపోర్ట్‌ చేస్తూ బాధితురాలిని కించపరిచేలా పోస్టులు చేస్తున్నారు. దీంతో దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి.. వీరిపై రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర పోస్టులు చేసిన అమర్‌నాథ్‌, శ్రవణ్‌, సందీప్‌ కుమార్‌, స్మైలీనాని అనే యువకులపై కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనపై ఎవరైనా అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడితే.. కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.