ఉధృతంగా సాగుతోన్న అమరావతి రైతుల ఆందోళన

ఉధృతంగా సాగుతోన్న అమరావతి రైతుల ఆందోళన

అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. మహాధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలతో రాజధాని ప్రాంతం అట్టుడుకుతోంది. ఇవాల్టితో రాజధాని రైతుల ఆందోళన 33వ రోజుకు చేరింది. ఇవాళ దుర్గగుడి వరకు పొంగళ్లుపెట్టుకుని రైతుల పాదయాత్ర యాత్ర చేయనున్నారు. ప్రధానంగా మందడం, వెలగపూడి రైతులు ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. అటు.. తుళ్లూరులోనూ ఇవాళ మహాధర్నా, వంటావార్పు నిర్వహించనున్నారు. నెల రోజులకుపైగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం కేబినెట్‌ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో... ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు రాజధాని రైతులు. టెంట్ వేసుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో మహిళలు, వృద్దులుసైతం ఎండలోనే నిరసన కొనసాగిస్తున్నారు. జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం గానీ.. అమరావతిని వదులుకోమని నినదించారు.

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అటు... బెజవాడ బీఆర్డీఎస్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు, యువకులు పెద్దయెత్తున పాల్గొన్నారు. తుళ్లూరులో అసైన్డ్‌ రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేయాలని.. తమకు భూములు అమ్ముకునే హక్కు కల్పించాలని కోరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. తుళ్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి CRDA ఆఫీస్ వరకూ ఎస్సీ, ఎస్టీ రైతులు, మహిళలు ర్యాలీ చేపట్టారు.

సోమవారం అమరావతి రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి, ప్రజాసంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు... పోలీసులు అప్రమత్తమ య్యారు. రాజధాని పరిధిలో ఉండే

రాజకీయ నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతులకు సీఆర్‌పీసీ సెక్ష న్‌ 149కింద నోటీసులు చేశారు. నిబంధనలు ఉల్లం ఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రేపు అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా అదనపు బలగాలు సైతం రంగంలో దిగాయి.

Tags

Read MoreRead Less
Next Story