తొక్కే కదా అని పడేస్తున్నారా.. ఇవి తెలిస్తే..

తొక్కే కదా అని పడేస్తున్నారా.. ఇవి తెలిస్తే..

banana-peel

అందరం చేసే పనే.. అరటి పండు తిని తొక్క పడేయడం.. తొక్కలోది.. తొక్కలో ఏముంటాయని అనకండి.. బోలెడు ప్రయోజనాలు ఉన్నాయండి.. ఇవి తెలిస్తే మీరు కూడా అరటి తొక్కలు పడేయరు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, బి6, బి12, ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, పీచు పదార్థాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రొటీన్లు ఉంటాయి. ఆరోగ్యానికి, అందానికి మేలు చేసే అరటి తొక్కల గురించి తెలుసుకుందాం..

అరటి తొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తొక్కతో మొటిమలపై రుద్దితే తగ్గుముఖం పడతాయి.

ఎగ్‌వైట్ తీసుకుని అందులో అరటి తొక్కని గుజ్జుగా చేసి కలిపి ముఖానికి పట్టిస్తే ముడతలు తగ్గుతాయి.

నొప్పులు, వాపులు ఉన్న చోట అరటి తొక్కను గుజ్జుగా చేసి దానికి వెజిటబుల్ ఆయిల్ కలిపి మసాజ్ చేస్తే తగ్గుతాయి.

అలర్జీలు, దురదలు వచ్చే చోట అరటి తొక్క గుజ్జును రాస్తే ఉపశమనం ఉంటుంది.

కాలిన గాయాలు, పుండ్లు, దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్ధనా చేస్తే గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

ఈ తొక్కతో పళ్లు రుద్దుకుంటే దంతాలు తెల్లగా మారతాయి.

నీటిలో అరటి తొక్కలు వేస్తే నీళ్లు శుభ్రంగా మారతాయి.

అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయ పడుతుంది. పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటి తొక్కతో రుద్దాలి లేదంటే పులిపిరిపై అరటి తొక్కను ఉంచి దానిపైన ప్లాస్టర్ వేసి రాత్రంతా ఉంచాలి. కొన్ని రోజులు ఇలా చేస్తుంటే పులిపిర్లు పూర్తిగా రాలిపోతాయి.

Read MoreRead Less
Next Story