వన్ స్టేట్.. వన్ క్యాపిటల్ పేరుతో కదం తొక్కిన ఎన్నారైలు

వన్ స్టేట్.. వన్ క్యాపిటల్ పేరుతో కదం తొక్కిన ఎన్నారైలు

us-amaravati

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొసానగించాలని అమెరికాలో ప్రవాసాంధ్రులు కోరుతున్నారు. చార్లెట్ నగరంలోని వందలాదిమంది ఎన్నారైలు అమరావతి రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో మహిళలు, చిన్నారులు సైతం పాల్గొన్నారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా అమరావతిలో ఉన్న రైతులతో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి సభ్యుడు ప్రొఫెసర్ శ్రీనవాస్ కొలికపూడి, వీడియో కాన్పరెన్స్ ద్వారా ఉద్యమ వివరాలను ఎన్నారైలకు తెలియజేశారు. వన్ స్టేట్, వన్ క్యాపిటల్ పేరుతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో అన్నిరంగాలకు చెందిన ఎన్నారైలు పాల్గొని మద్దతు తెలిపారు.

అటు.. అమెరికాలోని అట్లాంటాలో కూడా ప్రవాసాంధ్రులు కదంతొక్కారు. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో రాజధాని రైతులకు మద్దతుగా ర్యాలీ తీశారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా చిన్నారులు, మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజధాని ప్రకటన తర్వాత అమరావతిలోని ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి నిరసన ప్రదర్శనలో ఎన్నారై టీడీపీ నాయకులతోపాటు ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story