'మాది రెడ్డి కులమని రాసుకోండి' : అమరావతిలో పోలీసులకు దిమ్మతిరిగే సమాధానం..

మాది రెడ్డి కులమని రాసుకోండి : అమరావతిలో పోలీసులకు దిమ్మతిరిగే సమాధానం..

amaravathiఅమరావతి జనంలో కులం కంచె కట్టి.. రాజధానిని తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కొన్నాళ్లుగా విమర్శలు చేస్తున్నాయి. కేవలం ఒక్క కులం ప్రయోజనాల కోసమే రాజధాని కడుతున్నారంటూ కలరింగ్ ఇచ్చి రాజధాని తరలింపు ప్రక్రియను సాఫీగా ముగించే ప్లాన్ వర్కౌట్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను వాస్తవం అనేలా నిన్నటి నిర్బంధకాండలో సాక్ష్యాలు కళ్లకు కడుతున్నాయి.

అమరావతి కోసం ర్యాలీ చేపట్టిన మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు...వారి కులాలు, మతాల గురించి ఆరా తీయటం కలకలం రేపుతోంది. పోలీసుల ప్రశ్నలతో చిర్రెత్తుకొచ్చిన మహిళలు అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు. కులాలను బట్టి అరెస్ట్ చేస్తారా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కులమే కావాలంటే మాది రైతు కులం..మా మతం దుర్గమ్మ, మాది అమరావతి అంటూ పోలీసులకు సమాధానం ఇచ్చారు. ఇంకా కావాలంటే తమది రెడ్డి కులమని రాసుకోమంటూ మహిళలందరూ పోలీసులకు దిమ్మతిరిగేలా బదులిచ్చారు.

చివరికి విజయవాడ మాజీ మేయర్ అనురాధకు కూడా కులం వేధింపులు తప్పలేదు. మీదు ఏ కులం అంటూ పోలీసులు తనను ప్రశ్నించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కులం ముసుగుతో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం ఇష్టపడటం లేదని ఇక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వారిలో అన్ని కులాల వారు ఉన్నారని చెబుతూ వస్తున్నారు. అయినా..తమ ప్రయోజనాల కోసం రాజధానిని తరలించేందుకు కులాన్ని సాకుగా వాడుకుంటున్నారన్నది అమరావతి రైతుల వాదన. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు అరెస్టైన మహిళల కులాలు, మతాల గురించి ఆరా తీయటం వివాదస్పదం అవుతోంది. కులం, మతం అడగటానికి మేము నేరస్తులమా? అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story