హైదరాబాద్‌కు తాకిన అమరావతి రాజధాని సెగ

hyd-bogi

అమరావతి రాజధానిగా సెగ హైదరాబాద్‌కు తాకింది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధానిని కొనసాగించాలని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భోగి మంటలు వేశారు. జీఎస్ రావు ,బొస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేస్తూ సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. గ్రీన్ క్యాపిటల్‌గా రూపుదిద్దుకుంటున్న అమరావతిని కాపాడాలంటూ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు.