11 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

11 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదముద్ర వేసింది ఏపీ కేబినెట్. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు, అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 45 నిమిషాలకుపైగా సాగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మొత్తం ఏడు బిల్లులను ఆమోదించింది కేబినెట్.. రాజధాని రైతులకు మెరుగైన మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది. భూములిచ్చిన రైతులకు కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంచారు. అమరావతిలోనే మూడు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. విశాఖలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు ఉంటాయి... ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ జరపాలని నిర్ణయించారు.. పులివెందుల అర్బన్ డెవలప్‌ మెంట్ అథారిటీకి కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. 11 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story