అయోధ్య పని పూర్తైంది.. ఇక తిరుపతే: చక్రపాణి మహారాజ్‌

అయోధ్య పని పూర్తైంది.. ఇక తిరుపతే: చక్రపాణి మహారాజ్‌

ss

అయోధ్య వివాదం ముగియడంతో.. ఇక తమ తదుపరి లక్ష్యం తిరుమల తిరుపతి దేవస్థానమేనన్నారు హిందూ మహాసభ ఛైర్మన్‌ స్వామి చక్రపాణి మహారాజ్‌. దీనిపై ఉద్యమం చేస్తామని.. త్వరలోనే తిరుమలను దర్శించి అక్కడి చేపట్టాల్సిన సంస్కరణలపై హిందూ మహసభ ఉద్యమం చేపడుతుందన్నారు.

టీటీడీ ద్వారా వచ్చిన ఆదాయం అంతా వేంకటేశ్వరస్వామి భక్తులకే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు స్వామి చక్రపాణి మహారాజ్‌. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం టీటీడీ నిధులను ప్రభుత్వ పథకాలకు మళ్లీస్తోందని మండిపడ్డారు. తిరుపతి లడ్డూల అమ్మకం పైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదాన్ని ఉచితంగానే భక్తులకు పంచాలని.. దాంతో వ్యాపారం చేయకూడదన్నారు స్వామి చక్రపాణి మహారాజ్‌.

మరోవైపు, టీటీడీలో అన్యమత ఉద్యోగుల కొనసాగింపుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్వామి చక్రపాణి మహారాజ్‌. చర్చి, మసీదుల్లో హిందువులు ఉద్యోగులుగా ఉన్నారా అని ప్రశ్నించారు.

ప్రభుత్వాలు సెక్యులర్‌గా ఉండొచ్చు కానీ దేవాలయాలు మాత్రం పూర్తిగా హిందూ మత పరిధిలోనే ఉండాలన్నారు స్వామి చక్రపాణి మహారాజ్‌.

టీటీడీ బోర్డును సైతం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు స్వామి చక్రపాణి మహారాజ్‌. కొత్తగా మరో బోర్డు ఏర్పాటు చేయాలని, అందులో హిందూమతంపై పూర్తి విశ్వాసం కలిగిన వారినే నియమించాలని స్వామీ చక్రపాణి మహారాజ్‌ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story