ప్రారంభమైన కరీంనగర్‌ కార్పొరేషన్ మున్సిపల్‌ పోలింగ్

ప్రారంభమైన కరీంనగర్‌ కార్పొరేషన్ మున్సిపల్‌ పోలింగ్

కరీంనగర్‌ కార్పొరేషన్ మున్సిపల్‌ పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 60 డివిజన్లున్నాయి. వాటిలో రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. 20వ డివిజన్‌లో తుల రాజేశ్వరి, 37వ డివిజన్‌లో చల్ల స్వరూపారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో, మిగిలిన 58 స్థానాలకు ఎలక్షన్‌ జరుగనుంది. మొత్తం 371 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2 లక్షల 72వేల 195 మంది ప్రజలు ఓటు వేయనున్నారు. వారి కోసం 348 పోలింగ్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచారు అధికారులు.

ఈ ఎన్నికల విధుల్లో దాదాపు 2 వేల మంది ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తారు. కాగా, ఈ నెల 27న కరీంనగర్ కార్పొరేషన్‌ ఫలితాలు ప్రకటిస్తారు. ఇక, కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు.. బుధవారం జరిగిన పురపాలక ఎన్నికల్లో టెండర్ ఓట్లు దాఖలైన.. మూడు చోట్ల రీపోలింగ్ మొదలైంది. మహబూబ్ నగర్, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీల పరిధిలోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో టెండర్ ఓట్లు దాఖలు కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. బుధావరం జరిగిన 120 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింప కూడా శనివారం చేపట్టనున్నారు.

శనివారం జరుగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాల్టీలోని MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లను పోలీస్‌ ఉన్నతాధికారలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

Read MoreRead Less
Next Story