ఎయిర్‌పోర్టులో తానే బాంబ్ పెట్టా అని లొంగిపోయిన వ్యక్తి

ఎయిర్‌పోర్టులో తానే బాంబ్ పెట్టా అని లొంగిపోయిన వ్యక్తి

మంగుళూరు ఎయిర్‌పోర్టు బాంబ్ బ్లాస్ట్ కేసులో మిస్టరీ వీడుతోంది. ప్రధాన అనుమానితుడు ఆదిత్యరావు పోలీసుల ముందు లొంగిపోయాడు. బాంబు తానే పెట్టానంటూ బెంగళూరులోని డీజీపీ ఆఫీసులో అతను సరెండర్ అయ్యాడు. అనంతరం అతనికి విక్టోరియా మెమోరియల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత స్థానిక కోర్టులో హాజరుపరిచారు. 36 ఏళ్ల ఆదిత్యారావు.. మణిపాల్‌ కు చెందిన వ్యక్తి. ఇంజినీరింగ్ చేసి MBA కంప్లీట్ చేశాడు. ఉన్నత చదువులు చదివినా సరైన ఉద్యోగం దొరకడం లేదన్నది ఆదిత్యారావు ఆరోపణ. ఆ ఫ్రస్టేషన్‌లోనే విమానాశ్రయంలో బాంబు పెట్టానని చెప్పుకొచ్చాడు.

ఈనెల 20వ తేదీన మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం రేపింది. ఆటోలో వచ్చిన ఒక వ్యక్తి విమానశ్రయం పరిసరాల్లో అనుమానిత బ్యాగును వదిలి వెళ్లాడు. యువకుడి తీరుపై అనుమానం వచ్చిన ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ బ్యాగును తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు కనిపించాయి. దాంతో, వెంటనే ఆ పేలుడు పదార్థాలను దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించి ఫోటోలు విడుదల చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బాంబును తానే పెట్టానంటూ ఆదిత్యారావు అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.

Tags

Read MoreRead Less
Next Story