మోదీ ఆవిష్కరణ.. రూ.25,000 ఉంటే నచ్చిన ఇల్లు బుక్ చేసుకోవచ్చు..

మోదీ ఆవిష్కరణ.. రూ.25,000 ఉంటే నచ్చిన ఇల్లు బుక్ చేసుకోవచ్చు..

apatments

కొత్త ఇల్లు కొనుగోలు చేయాలంటే ఎంతో పని.. ఏ ఏరియా బావుంటుంది. అక్కడ అందుబాటులో ఉన్న కొత్త వెంచర్లు ఏంటి.. రేట్లు ఎలా ఉన్నాయి.. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా లేదా ఇలా ఎన్నో అనుమానాలు. అన్ని ప్రాజెక్టులు ఒకే వేదిక దగ్గర ఉంటే నచ్చిన ఇంటిని ఎంచుకోవడం ఈజీ అవుతుంది. ఆ దిశగా చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం రియల్టర్ల కోసం ఓ సరికొత్త పోర్టల్‌ని ఆవిష్కరించింది. అదే 'Housing For All.com'. గృహ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఈ వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ఇల్లు కొనుగోళ్లకు సంబంధించి పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మిశ్రా తెలిపారు.

ఇంటి కొనుగోలు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కొత్త పోర్టల్‌లో రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టులు మాత్రమే ఉంచుతారు. రెరా రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే పూర్తయిన ఇంటి నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులే ఈ పోర్టల్‌లో ఉంటాయి. అందువల్ల నచ్చిన ఇంటిని వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ వెబ్‌సైట్ మొదట రియల్ ఎస్టేట్ డెవలపర్లకు అందుబాటులోకి వస్తుంది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు వారి ప్రాజెక్టుల వివరాలను సైట్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆ తరువాత అంటే ఫిబ్రవరి 14 నుంచి ఇంటి కొనుగోలు దారులకు ఈ సైట్ సర్వీసులు లభిస్తాయి. నచ్చిన ఇల్లు కొనుగోలు చేసే ముందు అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అలా ఎంపిక చేసుకున్న ఇంటిని మార్చి1 నుంచి 31 మధ్యలో కొనుగోలు చేయవచ్చు. కనీసం రూ.25,000 పెట్టుబడి పెట్టి నచ్చిన ఇంటిని రిజర్వ్ చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ బుక్ చేసుకున్న తరువాత ఏమైనా ఇబ్బందులు ఎదురైతే క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మీరు కట్టిన సొమ్ము కూడా వెనక్కి వచ్చేస్తుంది. మొత్తం 1,000 ప్రాజెక్టులు ఈసైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Read MoreRead Less
Next Story