కొడుకు పేరు 'కాంగ్రెస్ జైన్'.. అంతిష్టం మరి..

కొడుకు పేరు కాంగ్రెస్ జైన్.. అంతిష్టం మరి..

పిల్లలకు పేరు పెట్టాలంటే అమ్మదో, నాన్నదో, తాతయ్యదో, నానమ్మదో పెడతారు. వారి పట్ల కృతజ్ఞత, ప్రేమ, ఇష్టం అన్నీ కలిసి తమ చిన్నారులకు వారి పేర్లు పెట్టేలా చేస్తాయి. మరి వారి పేర్లు కాకుండా ఇంకెవరిదైనా పెడితే వారిని ఎంతగా అభిమానిస్తారో అర్ధమవుతుంది. అవేవీ కాదని నాకు ఆ పార్టీ అంటే చాలా అష్టం.. మా తాతల్నించి అందరం ఆ పార్టీ నీడన పెరిగిన వాళ్లమే అందుకే నా కొడుక్కి పార్టీ పేరే పెట్టేస్తాను అని కాంగ్రెస్ జైన్ అని పెట్టేశారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న వినోద్ జైన్‌కి గత ఏడాది జూలైలో జన్మించిన కుమారుడికి తనకు నచ్చిన కాంగ్రెస్ జైన్ అని పెడతానంటే కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారట. కానీ వాళ్లందరినీ ఒప్పించి మరీ తనకు నచ్చిన పేరు పెట్టేశారు. ఇటీవలే ఆపేరుతో బర్త్‌సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. తాను స్ఫూర్తి ప్రదాతగా భావించే అశోక్ గెహ్లాట్ వద్దకు తన కుమారుడిని తీసుకుని వెళ్లానని చెప్పారు. 18 ఏళ్లు వచ్చాక నా కొడుకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story