డిగ్రీ చదివినవారికి శుభవార్త.. ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు

డిగ్రీ చదివినవారికి శుభవార్త.. ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు

sbi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 7870 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల్ని భర్తీ చేస్తుంది. ఇందులో హైదరాబాద్ రీజియన్‌లో 375 పోస్టులున్నాయి. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2020 జనవరి 26 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు https://sbi.co.in/ వెబ్‌సైట్‌లోని కెరీర్ సెక్షన్‌లో మరిన్ని వివరాలు చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 7870 పోస్టులు (హైదరాబాద్‌లో 375 ఖాళీలు)

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

వయసు: 2020 జనవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు 15 ఏళ్లు, ఓబీసీ వికలాంగులకు 13 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 3.. దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 26.. ప్రిలిమినరీ ఎగ్జామ్: ఫిబ్రవరి లేదా మార్చి.. మెయిన్ ఎగ్జామ్: ఏప్రిల్ 19.. తుది ఫలితాలు: జూన్‌లో

Read MoreRead Less
Next Story