అమరావతి భవిష్యత్తు ఏంటి..? ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతోంది..?

అమరావతి భవిష్యత్తు ఏంటి..? ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతోంది..?

అమరావతి భవిష్యత్తు ఏంటి..? ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతోంది..? మూడు రాజధానులకు ఓటేస్తుందా..? అమరావతి తరలింపుపై స్పష్టత ఇస్తుందా..? విశాఖను రాజధానిగా ప్రకటించనుందా..? సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తుందా.. నేటి పరిణామాల కోసం రాష్ట్ర మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఉదయం 9 గంటలకు కేబినెట్‌ భేటీలోనే దీనిపై నిర్ణయం తీసుకుని.. ఆ బిల్లులకు ఆమోదం తెలిపి.. తరువాత 11 గంటలకు అసెంబ్లీలో బిల్లులు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాజధాని తరలింపువైపే ప్రభుత్వం మొగ్గు చూపుతుండడంతో.. ప్రతిఘటనకు ప్రతిపక్షం సిద్ధమైంది. అటు రైతులు, జేఏసీ నేతలు. విపక్షాలన్నీ ఒకే రాష్ట్రం.. ఒక రాజధాని అని నినదిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నాయి. కేవలం రాజధాని ప్రాంత నేతలే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విపక్ష నేతలు అసెంబ్లీ ముట్టడి కోసం రాజధానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించిన పోలీసులు.. ఇప్పటికే భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ నేతలను కట్టడి చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. అమరావతి జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి ఎవరూ రాకుండా అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు. అయినా విపక్షాలు వెనక్కు తగ్గడం లేదు. అసెంబ్లీని ముట్టడించి తీరుతామంటున్నాయి. ఆందోళనలు.. అరెస్టులతో రాజధానిలో పరిస్థితి తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది..

ఒక్క అమరావతి ప్రాంతంలోనే 5 వేల మంది పోలీసులు మోహరించారు. అసెంబ్లీ సమావేశాలకు.. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిశరాల్లో పలు ఆంక్షలు విధించారు. ప్రకాశం బ్యారేజీపై వెళ్లేందుకు ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధులకు మాత్రం అవకాశం కల్పిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story