కరోనాపై తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్‌

కరోనాపై తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్‌

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా 77 దేశాల్లో ప్రభావం చూపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ- WHO పేర్కొంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో కరోనాను సమర్ధంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి, బాధితుల పరిస్థితిపై తెలంగాణ ఆరోగ్యశాఖ మీడియా బులెటిన్‌ విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం.. గురువారం 3 వేల 740 మందికి ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్‌ నిర్వహించారు. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం 22 వేల 790 మందికి స్క్రీనింగ్ టెస్టులు చేపట్టారు. తమకు కరోనా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తూ.. గురువారం ఒక్క రోజులో 75 మంది వైద్య సహాయం ఆశ్రయించగా.. ఇలా వచ్చిన వారు మొత్తం 422 మంది ఉన్నారు.

ప్రభుత్వం, ఇతర ఆరోగ్య సంస్థల ద్వారా కరోనాపై అనుమానంతో రిఫర్‌ అయినవారు నిన్న ఎవరూ లేరు. అంతకుముందు వరకు వీరి మొత్తం 189గా ఉంది. మొత్తం అనుమానితులు 75 మంది కాగా.. అంతకుముందు పరీక్షించిన వారి సంఖ్య 611. ఇళ్ల నుంచి వచ్చినవారిలో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించని వారి సంఖ్య 53 కాగా.. ఇప్పటి వరకు ఇలా వచ్చిన వారు 396 మంది వచ్చారు.

కరోనా వైరస్‌ వచ్చి ఉంటుందని ఆసుపత్రులకు వచ్చిన వారి సంఖ్య గురువారం ఒక్క రోజులో 22 మంది కాగా.. వీరి మొత్తం సంఖ్య 215. ఒక్కరోజులో 22 మంది శాంపిల్స్‌ కలెక్ట్‌ చేశారు. 22 మందికి నెగటివ్ రిపోర్ట్‌ వచ్చింది. ఇలా మొత్తం 215 మంది శాంపిల్స్‌ కలెక్ట్‌ చేయగా.. వారిలో 169 మందికి నెగటివ్‌ రిపోర్ట్ వచ్చింది. గురువారర ఒక్కరోజులో టెస్ట్‌ రిజల్ట్స్‌ కోసం 12 మంది వెయిట్ చేస్తుండగా.. మొత్తం ఈ సంఖ్య 45గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story