చీరకట్టులో క్రికెట్‌ ఆడుతూ.. మహిళల జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన మాజీ కెప్టెన్‌

చీరకట్టులో క్రికెట్‌ ఆడుతూ.. మహిళల జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన మాజీ కెప్టెన్‌

మహిళా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆదివారం జరగనుంది. తొలిసారి భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరింది. ఈ సందర్భంగా మన మహిళల జట్టుకు.. టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయంగా చీరకట్టి.. మైదానంలో సిక్సర్‌ కొట్టి.. మహిళల జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

సుదీర్ఘ కాలం భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచిన మిథాలీ రాజ్‌ .. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగింది. ఎందరో మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా మారారు. అలాంటి మిథాలీ.. తొలిసారిగా భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన వేళ సిటీ గ్రూప్‌తో కలిసి ఈ ప్రత్యేక వీడియోను రూపొందించారు.

ఈ వీడియోలో మిథాలీ చీరకట్టులో క్రికెట్‌ ఆడుతూ కనిపించింది. మిథాలీ అచీవ్‌మెంట్స్‌ను కూడా వీడియోలో కనిపిస్తాయి. ఈ వీడియోను మిథాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. కట్టుబాట్లు తెంచుకుని అమ్మాయిలు ఎదుగుతున్నారని చెప్పడానికి ఆమె చీరకట్టులో క్రికెట్‌ ఆడారు. కమాన్‌ టీమిండియా, ప్రపంచకప్‌ను తీసుకురండి అని అమె మెసేజ్‌ ఇచ్చారు9. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story